నా జీవం నీ కృపలో

naa jeevam nee krupaloo

🎵 TG-2355🌐 Telugu
పల్లవి

నా జీవం నీ కృపలో దాచితివే నా జీవిత కాలమంతా ప్రభువా నీవే నా ఆశ్రయం నా ఆశ్రయం ||నా జీవం||

1వ చరణం

పాపపు ఊబిలో పడి కృంగిన నాకు నిత్య జీవమిచ్చితివే (2) పావురము వలె నీ సన్నిధిలో జీవింప పిలచితివే (2)       ||నా జీవం||

2వ చరణం

ఐగుప్తు విడచినా ఎర్ర సముద్రము అడ్డురానే వచ్చెనే నీ బాహు బలమే నన్ను దాటించి శత్రువునే కూల్చెనే కానాను యాత్రలో యొర్దాను అలలచే కలత చెందితినే కాపరివైన నీవు దహించు అగ్నిగా నా ముందు నడచితివే వాగ్ధాన భూమిలో మృత సముద్రపు భయము నన్ను వెంటాడెనే వాక్యమైయున్న నీ సహవాసము ధైర్యము పుట్టించెనే స్తుతుల మధ్యలో నివసించువాడా స్తుతికి పాత్రుడా స్తుతి యాగముగా నీ సేవలో ప్రాణార్పణ చేతునే

Report Error