నా జీవిత వ్యధలందు యేసే
naa jeevitha vyadhalandu yeesee
🎵 TG-2786🌐 Telugu
పల్లవి
నా జీవిత వ్యధలందు యేసే జవాబు యేసే జవాబు – ప్రభు యేసే జవాబు (2) ||నా జీవిత||
1వ చరణం
తీరని మమతలతో ఆరని మంటలలో ఆశ నిరాశలతో తూలెను నా బ్రతుకే (2) నను గని వచ్చెను – తన కృప నిచ్చెను కరుణతో ప్రేమించి – కలుషము బాపెను ||నా జీవిత||
2వ చరణం
చీకటి వీధులలో నీటుగా నడచితిని లోకపు ఉచ్ఛులలో శోకము జూచితిని హంగుల వేషముతో రంగుల వలయములో నింగికి నేనెగిరి నేలను రాలితిని