నా జీవిత యాత్రలో ప్రభువా

naa jeevitha yaathraloo prabhuvaa

🎵 TG-2107🌐 Telugu
పల్లవి

నా జీవిత యాత్రలో ప్రభువా నీ పాదమే శరణం ఈ లోకమునందు నీవు తప్ప వేరే ఆశ్రయం లేదు (2)       ||నా జీవిత||

1వ చరణం

పలు విధ శోధన కష్టములు ఆవరించియుండగా (2) కలత చెందుచున్న హృదయమును కదలక కాపాడుము నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదు నీదు కుడి హస్తములో నిత్యమున నాకు సుఖ క్షేమముగా ఈ లోక నటన ఆశలన్నియు తరిగిపోవుచుండగా మారని వాగ్ధానములన్నియు నే నమ్మి సాగెదను ముందున్న సంతోషము తలంచి నిందలను సహించి నీ సిలువను నే మోయుటకై నీ కృప నాకీయుము (2)     ||నా జీవిత||

2వ చరణం

సీయోను యొక్క ఆలోచనతో సదా నడిపించుము మహిమలో నీతోనే నిల్చుటకు నా తండ్రి దయచూపుము

Report Error