నా జీవితాంతము నీ సేవ

naa jeevithaanthamu nee seeva

🎵 TG-1711🌐 Telugu
పల్లవి

నా జీవితాంతము నీ సేవ చేతునంటిని నే బ్రతుకు కాలము నీతోనే నడుతునంటిని నా మనవి వింటివి నన్నాదుకొంటివి (2)        ||నా జీవితాంతము||

1వ చరణం

నీ ప్రేమ చూపించి నన్ను నీవు పిలిచితివి నీ శక్తి పంపించి బలపరచి నిలిపితివి (2) నా ప్రాణప్రియుడా నా యేసయ్యా (2)       ||నా జీవితాంతము||

2వ చరణం

రోగముతో పలుమార్లు పడియుండ లేపితివి ఘోరమై పోకుండా స్థిరపరచి కాచితివి దూషించు దుష్టులకు సిగ్గును కలిగించితివి వేలాది ఆత్మలకు మేలుగ నన్నుంచితివి సంఘములు కట్టుటకు సామర్ధ్యమిచ్చితివి ఉపదేశమిచ్చుటకు దేశములు తిప్పితివి

Report Error