నా కనుచూపు మేర
naa kanuchuupu meera
🎵 TG-2252🌐 Telugu
పల్లవి
నా కనుచూపు మేర – యేసు నీ ప్రేమ పొంగి పారెనే – పొంగి పారెనే (2) నే ప్రేమింతును – నా యేసుని మనసారా ఆరిపోవు లోక ప్రేమల కన్నా ఆదరించు క్రీస్తు ప్రేమే మిన్న (2) ||నా కనుచూపు||
1వ చరణం
నా కన్నీటిని తుడిచినా ప్రేమ నలిగిన నా హృదయాన్ని కోరిన ప్రేమ ఎన్నడూ ఎడబాయనిది ఆ ప్రేమ నన్ను పరముకు చేర్చ దిగి వచ్చిన ప్రేమ నా దీన స్థితిని చూచిన ప్రేమ తన శాశ్వత ప్రేమతో (నను) పిలిచిన ప్రేమ నా భారంబును మోసిన ప్రేమ సిలువలో నాకై చేతులు చాచిన ప్రేమ