నా కొరకై అన్నియు చేసెను

naa korakai anniyu cheesenu

🎵 TG-1678🌐 Telugu
పల్లవి

నా కొరకై అన్నియు చేసెను యేసు నాకింకా భయము లేదు లోకములో (2) నా కొరకై అన్నియు చేసినందులకు నేను – రక్షణ పాత్రను ఎత్తి ఆరాధించెదన్ (2)       ||నా కొరకై||

1వ చరణం

క్షామమందు ఏలీయాకు అప్పమిచ్చెను క్షామం తీర్చి ఏలీయాని ఆశీర్వదించెన్ క్షామం తీరే వరకు ఆ విధవరాలి ఇంట నూనెకైనా పిండికైనా కొరత లేదు ఆకాశ పక్షులను గమనించుడి విత్తవు అవి పంట కోయవు వాటిని పోషించునట్టి పరమ పితా మమ్ము – అనుదినం అద్భుతముగా నడుపును ఏమి ధరింతుమని చింతపడకు అడవి పువ్వులను తేరి చూడుము అడవి పువ్వుల ప్రభు అలంకరింప తానె – నిశ్చయముగా అలంకరించును రేపటి దినము గూర్చి చింత పడకు ఆప్తుడేసు నాకుండ భయము ఎందుకు రేపు దాని సంగతులనదే చింతించున్ ఏ – నాటి కీడు ఆనాటికే ఇల చాలును ఆశీర్వదించెడి యేసు అరణ్యములో పోషించెను ఐదు వేల మందిని కూడా తీర్చును ప్రభువే ప్రతి అవసరతన్ యేసు – తన్ను తానే అర్పించెను నా కొరకై

Report Error