నా నాన్న యింటికి నేను
naa naanna yintiki neenu
🎵 TG-1754🌐 Telugu
పల్లవి
నా నాన్న యింటికి నేను వెళ్ళాలి నా తండ్రి యేసుని నేను చూడాలి (2) నా నాన్న యింటిలో ఆదరణ ఉన్నది నా నాన్న యింటిలో సంతోషం ఉన్నది నా నాన్న యింటిలో నాట్యమున్నది ||నా నాన్న||
1వ చరణం
మగ్ధలేని మరియలాగా నీ పాదాలు చేరెదను కన్నీటితో నేను కడిగెదను తల వెంట్రుకలతో తుడిచెదను (2) ||నా నాన్న||
2వ చరణం
బేతనీయ మరియలాగా నీ సన్నిధి చేరెదను నీ వాక్యమును నేను ధ్యానింతును ఎడతెగక నీ సన్నిధి చేరెదను (2) ||నా నాన్న||
3వ చరణం
నీ దివ్య సన్నిధి నాకు మధురముగా ఉన్నదయ్యా పరలోక ఆనందం పొందెదను ఈ లోకమును నేను మరిచెదను