నా నాథుడా నా యుల్లమిచ్చితి

naa naathudaa naa yullamichchithi

🎵 TG-1897🌐 Telugu
పల్లవి

నా నాథుడా నా యుల్లమిచ్చితి నీకు (2) అన్నియు నీకై వీడి – నిన్నే వెంబడించితిని పెన్నుగ నాలో నాటుమా ప్రేమన్ ||నా నాథుడా||

1వ చరణం

దేవాలయ విగ్రహముల్ – దేవతలు వేయిలక్షల్ యావత్తు పెంటయనుచు నిదిగో ఆదియంత రహితుడ – ఆత్మల నాయకుడా ఆశ కల్గించు నాలోన నీవే పరిశుద్ధ యవతరుడా – మరియు తేనె అమృతుడా కరుణతో నన్ను గావుమా యిప్పుడు భూతలమునకు వేంచేసి – పాతకుల ప్రేమించితివి పాతకుడ నేనైతిని మహా ఆద్యంతము లేనట్టి – బీదలకు ధన నిధీ సదయుడా నన్ను చూడుమా యిపుడు హల్లెలూయ గీతమును – ఎల్లెడల చాటించెదను ఉల్లమందానంద ధ్వని యిదియే

Report Error