నా నోటన్ క్రొత్త పాట

naa nootan kroththa paata

🎵 TG-2855🌐 Telugu
పల్లవి

నా నోటన్ క్రొత్త పాట నా యేసు ఇచ్చెను (2) ఆనందించెదను ఆయననే పాడెదన్ జీవిత కాలమంతా హల్లెలూయా ||నా నోటన్||

1వ చరణం

అంధకార పాపమంత నన్ను చుట్టగా దేవుడే నా వెలుగై ఆదరించెను (2)        ||ఆనందించెదను||

2వ చరణం

దొంగ ఊభి నుండి నన్ను లేవనెత్తెను రక్తముతో నన్ను కడిగి శుద్ధి చేసెను నాకు తల్లిదండ్రి మరియు మిత్రుడాయెనే నిందలోర్చి ఆయనను ప్రకటింతును వ్యాధి బాధలందు నేను మొర్ర పెట్టగా ఆలకించి బాధ నుండి నన్ను రక్షించెను భువిలోని బాధలు నన్నేమి చేయును పరలోక దీవెనకై వేచియున్నాను

Report Error