నా నోటన్‌ క్రొత్త పాట నా యేసు ఇచ్చెను

naa nootan‌ kroththa paata naa yeesu ichchenu

🎵 TG-1099🌐 Telugu
పల్లవి

నా నోటన్‌ క్రొత్త పాట నా యేసు ఇచ్చెను .. ఆనందముతో హర్షించి పాడెదన్‌ జీవించు కాలమంతయు - హల్లేలూయ....

1వ చరణం

అంధకార పాపమంత - నన్ను చుట్టగా దేవుడే నా వెలుగై - ఆధరించెను ||నా నోటన్‌||

2వ చరణం

దొంగ ఊబి నుండి - నన్ను లేవనెత్తెను రక్తముతో నన్ను కడిగి - శుద్ది చేసెను ||నా నోటన్‌||

3వ చరణం

నాకు తల్లిదండ్రి మరియు - మిత్రుడాయెనే నిందలోర్చి ఆయనను - ప్రకటింతును ||నా నోటన్‌||

4వ చరణం

వ్యాది భాధ లందు నేను - మొర్ర పెట్టగా ఆలకించి బాధ నుండి నన్ను - రక్షించెను ||నా నోటన్‌||

5వ చరణం

భువి లోని భాదలు - నన్నేమి చేయును పరలోక దీవెనకై - వేచి యున్నాను ||నా నోటన్‌||

Report Error