నా ప్రాణ ప్రియుడా నా

naa praanna priyudaa naa

🎵 TG-2660🌐 Telugu
పల్లవి

నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా నను గన్న తండ్రి నా యేసయ్యా పూజింతును ఓ పూజార్హుడా భజియింతును ఓ భవదీయుడా నీవు గాక ఎవ్వరు నాకు లేరయ్యా (2) నీవే నీవే నా ప్రాణము నీవే నీవే నా సర్వము ||నా ప్రాణ||

1వ చరణం

ఒంటరినై తోడులేక దూరమైతిని ఓదార్చే వారు లేక భారమైతిని తండ్రీ… నీ తోడు లేక మోడునైతిని నీ తోడు దొరికాక చిగురించితిని (2)        ||నీవు గాక||

2వ చరణం

శత్రువుల చేతులలో చిక్కుకొంటిని సూటిపోటి మాటలకు నలిగిపోతిని తండ్రీ… నీ వైపు నేను చూసిన క్షణమే కష్టమంతయు తీరిపోయెను బాధలన్నియు తొలగిపోయెను ||నీవు గాక||

3వ చరణం

క్షణమైన నీ నామం మరువకుంటిని మరణమైన మధురంగా ఎంచుకుంటిని తండ్రీ… నీవున్నావని బ్రతుకుచుంటిని నా కొరకు నీవు నీ కొరకు నేను

Report Error