నా ప్రాణమా ఏలనే క్రుంగినావు

naa praannamaa eelanee krunginaavu

🎵 TG-2267🌐 Telugu
పల్లవి

నా ప్రాణమా ఏలనే క్రుంగినావు – నిరీక్షణా నీవుంచుమా సంతోషమూ కలిగీ స్తోత్రము – చెల్లించుమా స్తుతిపాడుమా ఆ యేసు మహిమలు ఆశ్చర్యకార్యాలు (2) నెమరేసుకుంటూ ప్రాణమా స్తుతిపాడుమా – స్తుతిపాడుమా ||నా ప్రాణమా||

1వ చరణం

నీ కొరకు బాధలెన్నో బహుగా భరించాడు నీ కొరకు సిలువలోన తాను మరణించాడు నా ప్రాణమా ఈ సత్యం గమనించుమా నీవు కూడా తన కార్యం పాటించుమా అలనాటి యేసు ప్రేమ మరువకు సుమా మరువకు సుమా – మరువకు సుమా నీ శత్రుసేననంతా మిత్రులుగ మార్చాడు నీ వ్యాధి బాధలందు నిన్ను ఓదార్చాడు నా ప్రాణమా నాలో కరిగిపోకే నీ గతం ఏమిటో మరచిపోకే దినమెల్ల దేవుని దయ కోరుమా దయ కోరుమా – దయ కోరుమా నీ చదువులోన నీకు విజయాన్ని ఇచ్చాడు నీ వయసులో నీకు తోడుగా ఉన్నాడు నా ప్రాణమా నాలో కృంగిపోకే దినమెల్ల దేవుని కృప కోరుమా కృప కోరుమా – కృప కోరుమా

Report Error