నా ప్రతి అవసరము తీర్చువాడవు
naa prathi avasaramu theerchuvaadavu
🎵 TG-1774🌐 Telugu
పల్లవి
నా ప్రతి అవసరము తీర్చువాడవు నీవే… యేసయ్యా నా ప్రతి ఆశ నెరవేర్చువాడవు నీవే… యేసయ్యా ఆకలితో నే అలమటించినప్పుడు అక్కరనెరిగి ఆదుకొన్నావు (2) వందనం యేసయ్యా నీకే వందనం యేసయ్యా ఊహించలేని ఆశ్చర్య కార్యములతో ఏ కొదువ లేక నను కాచుచుంటివి కష్టాలెన్ని వచ్చినా – కరువులెన్ని కలిగినా నీ చేతి నీడ ఎప్పుడూ నను దాటిపోదు ||వందనం||
1వ చరణం
తప్పిపోయినా త్రోవ మరచినా నీ కృప నన్ను విడచి వెళ్ళదు నీ కృప – విడచి వెళ్ళదు నన్నెప్పుడు యేసయ్యా.. నా ప్రతి విన్నపం నీ చెంత చేరునేసయ్యా – యేసయ్యా నా ప్రతి ప్రార్థనకు జవాబు నీవే యేసయ్యా – యేసయ్యా ఏమివ్వగలను ఎనలేని ప్రేమకై యేసయ్యా… వందనం