నా ప్రియమైన యేసు ప్రభు

naa priyamaina yeesu prabhu

🎵 TG-2651🌐 Telugu
పల్లవి

నా ప్రియమైన యేసు ప్రభు – వేలాది స్తోత్రములు నీవిచ్చిన రక్షణకై దేవా – స్తోత్రము స్తోత్రములు నీవు చేసిన ఉపకారములకై దేవా – స్తోత్రము స్తోత్రములు ||నా ప్రియమైన||

1వ చరణం

ఆపద దినములలో ఉపకారముకై – నా ప్రభుని తలచితిని (2) దేవా నీ దయ తోడనే – నాథా – ఆశ్రయం పొందితిని (2)        ||నా ప్రియమైన||

2వ చరణం

ఒక క్షణ సమయములో – నశించు నా జీవితం నా హృదయం మార్చితివి – దేవా – కృపతోనే జీవించుటకై లోకపు పాపములో – నే పాపిగా జీవించితిని శుద్ధ హృదయమిచ్చావు – దేవా – నిన్ను నే దర్శించుటకై ఈ దినమునే పాడుట – నీ వలెనే యేసు ప్రభు ఎల్లప్పుడు నీ పాడెదన్ – దేవా – నాయందు వసియించుము మందిర సమృద్ధిని – నీ ప్రజల సహవాసమును నీ సన్నిధి ఆనందమును – దేవా – కృపతోనే నొసగితివి

Report Error