నా తల్లి నను మరచినా

naa thalli nanu marachinaa

🎵 TG-2584🌐 Telugu
పల్లవి

నా తల్లి నను మరచినా నా వారే నను విడచినా (2) విడువని దేవుడవయ్యా ఎడబాయని వాడవయ్యా యేసయ్యా హల్లెలూయా (4)          ||నా తల్లి||

1వ చరణం

స్నేహితులే నన్ను బాధించినా బంధువులే నన్ను వెలివేసినా అన్నదమ్ములే నన్ను నిందించినా నే నమ్మినవారే గాయపరచినా (2)    ||విడువని||

2వ చరణం

లోకమంతా నన్ను ఏడ్పించినా శత్రువులే నన్ను వేధించినా సాతానే  నన్ను శోధించినా సమాజమే నన్ను త్రోసేసినా (2)        ||విడువని||

Report Error