నా తండ్రి నీవే
naa thandri neevee
🎵 TG-1341🌐 Telugu
పల్లవి
నా తండ్రి నీవే – నా దేవుడవు నీవే నా తండ్రి నీవే – నీవే (2) యేసయ్యా… యేసయ్యా… యేసయ్యా…. యేసయ్యా యేసయ్యా… యేసయ్యా… యేసయ్యా… యేసయ్యా ||నా తండ్రి||
1వ చరణం
నా అడుగులు తప్పటడుగులై నడిచిన నా ప్రతి మార్గము సరిచేయు నా తండ్రివి పగలు ఎండ దెబ్బయైనను రాత్రి వెన్నెల దెబ్బయైనను తగులకుండ కాచే నీ ప్రేమ (2) ||యేసయ్యా||
2వ చరణం
గాడాంధకార లోయలో నే నడచిన ప్రతివేళలో తోడున్న నా తండ్రివి వేయిమంది కుడి ఎడమకు కూలినా కూలును కాని చెదరకుండ నన్ను కాపాడు ప్రేమ