నా ఊహకందని ప్రేమతో నన్ను

naa uuhakandani preemathoo nannu

🎵 TG-2332🌐 Telugu
పల్లవి

నా ఊహకందని ప్రేమతో నన్ను నీవు పిలిచావు ఆ ప్రేమలోనే నన్ను నీలోనే నిలిపావు (2) నాలోన నీవున్నావు – నీలోన నను దాచావు నీ సాక్షిగా నను నిలిపావు (2)          ||నా ఊహకందని||

1వ చరణం

అందరు నన్ను చూచి నీ బ్రతుకు మారదని దూరాన నిలచి నన్ను చూచి నవ్వారే ఏనాడు అనుకోలేదు నన్ను నీవు ఎన్నుకుంటావని జీవితమంతా శూన్యమైపోగా నాకున్న వారే నన్ను విడచిపోగా నాకు తోడుగా నీవుంటావని నా జీవితాన్ని నీవు మార్చినావు నీ సేవలోనే నన్ను నిల్పినావు నా జీవితం ఇలా మారుతుందని

Report Error