నా యేసయ్యా నా స్తుతియాగము
naa yeesayyaa naa sthuthiyaagamu
🎵 TG-2085🌐 Telugu
పల్లవి
నా యేసయ్యా నా స్తుతియాగము నైవేద్యమునై ధూపము వోలె నీ సన్నిధానము చేరును నిత్యము చేతువు నాకు సహాయము వెనువెంటనే – వెనువెంటనే (2) ఆత్మతోను మనసుతోను నేను చేయు విన్నపములు ఆలకించి తండ్రి సన్నిధిలో నాకై విజ్ఞాపన చేయుచున్నావా ||నా యేసయ్యా||
1వ చరణం
ప్రార్థన చేసి యాచించగానే నీ బాహు బలము చూపించినావు మరణపు ముల్లును విరిచితివా నాకై మరణ భయము తొలగించితివా మెలకువ కలిగి ప్రార్థన చేసిన శోధనలన్నియు తప్పించెదవు నీ ప్రత్యక్షత నే చూచుటకే నాకై రారాజుగా దిగి వచ్చెదవు