నాకెంతో ఆనందం నీ సన్నిధి

naakenthoo aanandam nee sannidhi

🎵 TG-2297🌐 Telugu
పల్లవి

నాకెంతో ఆనందం నీ సన్నిధి ప్రభువా నీలో నేనుండుటే అదే నా ధన్యతయే (2) నాకెంతో ఆనందం… ఏ అపాయము నను సమీపించక ఏ రోగమైనను నా దరికి చేరక నీవు నడువు మార్గములో నా పాదము జారక నీ దూతలే నన్ను కాపాడితిరా (2)          ||నాకెంతో||

1వ చరణం

నా వేదనలో నిన్ను వేడుకొంటిని నా రోదనలో నీకు మొఱ్ఱ పెట్టితిని నా కన్నీటిని తుడిచి నీ కౌగిట చేర్చితివా నా కన్న తండ్రివై కాపాడుచుంటివా నూతన యెరూషలేం నా గమ్యమేనని నా కొరకు నీవు సిద్ధపరచుచుంటివా నీవుండు స్థలములో నేనుండ గోరెదను నా వాంఛ అదియే శ్రీ యేసయ్యా

Report Error