నాకు చాలిన దేవుడ నీవు

naaku chaalina deevuda neevu

🎵 TG-2837🌐 Telugu
పల్లవి

నాకు చాలిన దేవుడ నీవు నా కోసమే మరణించావు (2) నా శ్రమలలో నా ఆధారమా నను ఎడబాయని నా దైవమా ఏమిచ్చి నీ ఋణము నే తీర్చగలను ఏ రీతిగా నిను స్తుతియించగలను (2)       ||నాకు చాలిన||

1వ చరణం

వధకు సిద్ధమైన గొరియపిల్ల వోలె మౌనివై నా పాప శిక్షణోర్చినావు అన్యాయపు తీర్పుతో దోషిగ నిను చేసినా చిరునవ్వుతో సిలువనే భరించినావయ్యా (2)        ||ఏమిచ్చి||

2వ చరణం

ఎండిన భూమిలో లేత మొక్క వోలె నా శ్రమలను భరియించి నలుగగొట్టబడితివా సూదంటి రాళ్ళలో గొల్గొతా దారిలో నడవలేక సుడి వడి కూలినావయ్యా

Report Error