నాకున్నది నీవేనని నను కన్నది
naakunnadi neeveenani nanu kannadi
🎵 TG-1480🌐 Telugu
పల్లవి
నాకున్నది నీవేనని నను కన్నది సిలువేనని (2) నీవున్నది నాలోనని నేనున్నది నీకేనని సాక్ష్యమిచ్చెద యేసయ్యా నీ సాక్షిగా బ్రతికించుమయ్యా ||నాకున్నది||
1వ చరణం
గుడ్డివాడను నేనేనని నీ చూపు ప్రసాదించేవని చెవిటి వాడను నేనేనని నీ వినికిడి నేర్పించేవని ||సాక్ష్యమిచ్చెద||
2వ చరణం
మూగవాడను నేనేనని నీ మాటలు పలికించేవని అవిటివాడను నేనేనని నీ నడకలు నేర్పించేవని