నడిపిస్తాడు నాదేవుడు శ్రమలోనైనా నను విడువడు
naddipistaaddu naadeevuddu shramaloonainaa nanu vidduvaddu
పల్లవి
అడుగులు తడబడినా అలసట పైబడినా చేయితట్టి వెన్నుతట్టి చక్కని ఆలొచన చెప్పి (2)
1వ చరణం
అంధకారమే దారి మూసినా - నిందలే నను కృంగదీసినా తనచిత్తం నెరవేర్చుతాడు - గమ్యం వరకు నను చేర్చుతాడు
2వ చరణం
కష్టాల కొలిమి కాల్చివేసినా - శోకాలు గుండెను చీల్చివేసినా తనచిత్తం నెరవేర్చుతాడు - గమ్యం వరకు నను చేర్చుతాడు
3వ చరణం
నాకున్న కలిమి కరిగిపోయిన - నాకున్న బలిమి తరిగిపోయిన తనచిత్తం నెరవేర్చుతాడు - గమ్యం వరకు నను చేర్చుతాడు