నమ్మకమైన దేవుడవైన నీవే చాలు
nammakamaina deevudavaina neevee chaalu
🎵 TG-2824🌐 Telugu
పల్లవి
నమ్మకమైన దేవుడవైన నీవే చాలు యేసయ్యా (2) నేనేమైయున్నా ఏ స్థితిలో ఉన్నా ఇంకేమి కోరుకోనయ్యా (2) ||నమ్మకమైన||
1వ చరణం
ఆప్తులైన వారే హాని చేయచూసినా మిత్రులే నిలువకుండినా న్యాయము తీర్చే నీవు నాకుంటే చాలు యేసయ్యా జ్ఞానమంత చూపి శక్తి ధారపోసినా నష్టమే మిగులుచుండినా శాపము బాపే నీవు నాకుంటే కష్ట కాలమందు గుండె జారిపోయినా గమ్యమే తెలియకుండినా సాయము చేసే నీవు నాకుంటే