నమ్మితి నయ్యా యేసయ్యా నీ

nammithi nayyaa yeesayyaa nee

🎵 TG-326💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

నమ్మితి నయ్యా యేసయ్యా నీ పాదములే నమ్మితి నయ్యా యేసయ్యా నమ్మితి నయ్య నా నెమ్మదిలో నిన్ను నిమ్ముగఁ గృప నాపైఁ గుమ్మరిం చుము వేగ ||నమ్మితి నయ్యా||

1వ చరణం

పాప భార మనెడు మోపు మోయఁగ లేక కాపు నీవె యని నీ దాపు జేరిన నేను ||నమ్మితి నయ్యా||

2వ చరణం

ఆపత్కాలమునందుఁ బ్రాపు నీవని వేఁడఁ గాపాడి రక్షించు కరుణాసముద్రుఁడ ||నమ్మితి నయ్యా||

3వ చరణం

ఎన్ని తప్పులు నాలో నున్న నీ దయ చేత మన్నించి రక్షించు మహిత దేవ కుమార ||నమ్మితి నయ్యా||

4వ చరణం

దాసుని మొఱ నీవు వేసారక విని వాసిగా రక్షించు పరమ జనక నన్ను ||నమ్మితి నయ్యా||

Report Error