నన్ను కావగ వచ్చిన నజరేయా
nannu kaavaga vachchina najareeyaa
🎵 TG-2103🌐 Telugu
పల్లవి
నన్ను కావగ వచ్చిన నజరేయా యేసయ్యా నేను పాపము చేసినా చూపావు నీ దయా నన్ను ఎన్నడూ విడిచిపోకుమయ్యా సిలువ నీడలో నన్ను దాచుమయ్యా లోకమంతా నన్ను దోషిగ చూసినా ప్రేమతోనే నన్ను చేరదీసిన ||నన్ను||
1వ చరణం
నిన్ను విడచి దూరమైనా ధూళి నేనే యేసయ్యా లోకాశలకు లోబడిన లోభిని నేనేనయ్యా అందరు నన్ను అనాథ చేసి పోయినా అంధకారమే నాకు బంధువై మిగిలినా నా మదిలో మెదిలిన మోము నీదే నా యేసయ్యా నీ చరణములు చేరగానే నా గతి మారేనయ్యా నీ శరణము వేడగానే నీది నాదిగా మారెనే ఏ యోగ్యత నాకు లేకపోయినా నీ వారసునిగా నన్ను ఎంచిన ఇది ఊహకందని చిత్రమైన ప్రేమ నీదయ్యా