నను చేరిన నీ ప్రేమ

nanu cheerina nee preema

🎵 TG-1698🌐 Telugu
పల్లవి

నను చేరిన నీ ప్రేమ తొలగించని నీ ప్రేమ జీవితానికి చాలిన – యేసు నీ ప్రేమ నిను నేను విసిగించినా నిను విడచి పారిపోయినా నిను నేను హింసించినా – వీడని ప్రేమ నన్ను ఓర్చి దరికి చేర్చి స్నేహించి నను ప్రేమించి జీవమునిచ్చి నను దీవించి నీ పాత్రగ మలిచావు (2)          ||నను చేరిన||

1వ చరణం

నీ ప్రేమ నన్ను మార్చింది నీ రక్తం నన్ను కడిగింది నీ వాక్యం నన్ను నిలిపింది నీ మరణం జీవమునిచ్చింది (2)        ||నన్ను ఓర్చి||

2వ చరణం

నీ మాట నాకు ధైర్యంగా నీ స్పర్శ నాకు నెమ్మదిగా నీ ప్రేమ నాకు ఊపిరిగా నీ స్వరము నాకు శాంతిగా

Report Error