నీ చరణములే నమ్మితి నమ్మితి

nee charannamulee nammithi nammithi

🎵 TG-2383🌐 Telugu
పల్లవి

నీ చరణములే నమ్మితి నమ్మితి నీ పాదములే పట్టితి (2)            ||నీ చరణములే||

1వ చరణం

దిక్కిక నీవే చక్కగ రావే (2) మిక్కిలి మ్రొక్కుదు మ్రొక్కుదు మ్రొక్కుదు ||నీ చరణములే||

2వ చరణం

ఐహిక సుఖము – నరసితి నిత్యము ఆహాహా ద్రోహిని ద్రోహిని ద్రోహిని న్యాయము గాని – నా క్రియలన్ని రోయుచు ద్రోయకు త్రోయకు త్రోయకు భావము మార్చి – నావెత దీర్చి దేవర ప్రోవవే ప్రోవవే ప్రోవవే చంచల బుద్ధి – వంచన యెద్ది ఉంచక త్రుంచవే త్రుంచవే త్రుంచవే చుర్రుకొని యున్న – శోధనలున్న పట్టు విడ గొట్టవే కొట్టవే కొట్టవే నాచు పిశాచి – నరుకుట గాచి కాచుకో దాచవే దాచవే దాచవే యేసుని తోడ – నెవ్వరు సాటి దోసము బాపును బాపును బాపును

Report Error