నీ దయలో నేనున్న ఇంత

nee dayaloo neenunna intha

🎵 TG-2705🌐 Telugu
పల్లవి

నీ దయలో నేనున్న ఇంత కాలం నీ కృపలో దాచినావు గత కాలం (2) నీ దయ లేనిదే నేనేమౌదునో తెలియదయ్యా… ||నీ దయలో||

1వ చరణం

తల్లిదండ్రులు చూపిస్తారు ఎనలేని ప్రేమను ఇలలో చేయాలని ఆశిస్తారు అందనంత గొప్పవారిగా నీ దయ ఉంటే వారు – కాగలరు అధిపతులుగా నీ దయ లేకపోతే ఇలలో – బ్రతుకుట జరుగునా నీ సిలువ నీడలోనే నను దాచియుంచావని నా శేష జీవితాన్ని నీతోనే గడపాలని నేల రాలే నా ప్రాణాన్ని లేపి నన్ను నిలిపావు అపవాది కోరలకు అంటకుండ దాచావు నీ రెక్కల నీడలో నాకాశ్రయ దుర్గము ఏ కీడు నా దారికి రాకుండ నీ కృపను తోడుంచినావు నీ పాదాల చెంతనే నే పరవశించాలని నా ఆయువున్నంత వరకు నీ ప్రేమ పొందాలని

Report Error