నీ దీర్ఘశాంతమే నా హృదయానికి

nee deerghashaanthamee naa hrudayaaniki

🎵 TG-2688🌐 Telugu
పల్లవి

నీ దీర్ఘశాంతమే నా హృదయానికి ధైర్యము నీ కరుణా కటాక్షములే నా బ్రతుకుకు ఆధారము (2) యేసయ్యా… కనిపించరే నీలాగా ప్రేమించే వారెవరు (2)    ||నీ దీర్ఘ||

1వ చరణం

కడుపేద స్థితిలోనే కరువే నా బంధువాయెను వయసొచ్చిన తరుణములో వస్త్ర హీనతే కృంగదీసెను (ఏ) ఆధారము కనిపించని నా బ్రతుకులో ఐశ్వర్యవంతుడ నన్నాదుకున్నావు నీలాగా దీవించే వారెవరు ఈ లోక జ్ఞానులలో వెర్రివానిగా ఉంటిని ఎన్నికైన వారిలో వ్యర్థునిగా మిగిలి ఉంటిని తృణీకరింపబడిన నా బ్రతుకును కరుణా సంపన్నుడా నన్నెన్నుకున్నావు నీలాగా కృప చూపే వారెవరు నా ప్రాణము నాలో కృంగివున్న సమయములో జీవము గల నీకై నా ప్రాణము పరితపించెను మధురమైన నీ సహవాసముతో నా జీవ నాథుడా నీ మమతను పంచావు నీలాంటి జీవము గల దేవుడెవ్వరు

Report Error