నీ కంటిపాపను – నా
nee kantipaapanu – naa
🎵 TG-1414🌐 Telugu
పల్లవి
నీ కంటిపాపను – నా కంటనీరు చూడలేవు నీ చల్లని చూపులో – నేనుందును నీ కృపలో (2) యేసయ్యా.. యేసయ్య.. ఏ అడ్డూ వద్దయ్యా నీ ప్రేమకు నాలో సరిహద్దులు లేవయ్యా కన్నవారు నీ దారి నీదన్నారు నమ్మినవారే నవ్విపోయారు విరిగి నలిగి నీవైపు చూశాను తల్లివై తండ్రివై నన్నాదుకున్నావు ||యేసయ్యా||
1వ చరణం
ఎందరెందరిలో నన్నెన్నుకున్నావు ఎంతగానో ప్రేమించి లాలించావు నా ఊపిరీ నా ప్రాణమూ నీ దయలోనే నా జీవితం నీ మాటలో నా బాటను నీ ప్రేమలో నా పాటను సాగిపోనీ నా యాత్రనూ నీ దరి నేను చేరువరకు