నీ కృప నాకు చాలును
nee krupa naaku chaalunu
🎵 TG-1763🌐 Telugu
పల్లవి
నీ కృప నాకు చాలును నీ కృప లేనిదే నే బ్రతుకలేను (2) జల రాసులన్ని ఏక రాసిగా నిలిచిపోయెనే నీ జనుల ఎదుట అవి భూకంపాలే అయినా పెను తుఫానులే అయినా నీ కృపయే శాశించునా అవి అణగిపోవునా (2) ||నీ కృప||
1వ చరణం
జగదుద్పత్తికి ముందుగానే ఏర్పరచుకొని నన్ను పిలచితివా నీ పిలుపే స్థిరపరచెనే నీ కృపయే బలపరచెనే నీ కృపయే ఈ పరిచర్యను నాకు అనుగ్రహించెను (2) ||నీ కృప||