నీ నామం అతి మధురం
nee naamam athi madhuram
🎵 TG-2394🌐 Telugu
పల్లవి
నీ నామం అతి మధురం నీ గానం నే చేసెదను (2) నిన్నా నేడు నిరతం ఏకరీతిగ ఉన్న నామము ఎన్ని తరములైనా మార్పుచెందని ఘన నామము మహోన్నతమైనది యేసు నీ నామము కీర్తింపతగినది సాటిలేని నీ నామం ||నీ నామం||
1వ చరణం
ఆదరించే నామం – ఆశ్రయంబగు నామం ఆలకించే నామం – ఆత్మతో నడిపే నామం అన్ని నామములకు పైన నామం ఉన్నతంబగు నీ నామం జాలి గలిగిన నామం – జాగు చేయని నామం జవాబు నొసగే నామం – జయమునిచ్చే నామం (2) జుంటె తేనె కన్న మధురం జీవ జలమగు నీ నామం