నీ నిర్ణయం ఎంతో విలువైనది
nee nirnnayam enthoo viluvainadi
🎵 TG-2799🌐 Telugu
పల్లవి
నీ నిర్ణయం ఎంతో విలువైనది ఈ లోకంలో అది నిర్దేశించును జీవిత గమ్యమును ఈనాడే యేసుని చెంతకు చేరు (2) ||నీ నిర్ణయం||
1వ చరణం
లోకం దాని ఆశలు గతించిపోవును మన్నైన నీ దేహం మరల మన్నై పోవును (2) మారుమనస్సు పొందినచో పరలోకం పొందెదవు క్షయమైన నీ దేహం అక్షయముగా మారును పాపం దాని ఫలము నిత్య నరకాగ్నియే శాపంతో నీవుండిన తప్పదు మరణము భరియించె నీ శిక్ష సిలువలో ఆ ప్రభు యేసే ఈనాడే యోచించి ప్రభు యేసుని నమ్ముకో