నీ పాదాలే నాకు శరణం
nee paadaalee naaku sharannam
🎵 TG-2559🌐 Telugu
పల్లవి
నీ పాదాలే నాకు శరణం యేసయ్యా నీవే ఆధారము (2) నా ఆశ్రయ పురము – ఎత్తైన కోటవి నీవేనయ్యా నా దాగు చాటు నీవే యేసయ్యా (2) ||నీ పాదాలే||
1వ చరణం
అలసిన సమయములో ఆశ్రయించితి నీ పాద సన్నిధి నా ఆశ్రయుడా నీ కన్నా నాకు కనిపించదు వేరొక ఆశ్రయము శరణం శరణం శరణం నీవే శరణం యేసయ్యా ఇరుకు ఇబ్బందులలో చూచుచుంటిని నీ వైపు నేను నా పోషకుడా నీ కన్న నాకు కనిపించరే వేరొక పోషకుడు సాతాను శోధనలో పరుగెత్తితిని నీ వాక్కు కొరకు నా జయశీలుడా నీకన్న నాకు కనిపించరే జయమును ఇచ్చే వేరొకరు కనిపించరే జయమునిచ్చే వేరొకరు