నీ ప్రేమ నా జీవితాన్ని

nee preema naa jeevithaanni

🎵 TG-1794🌐 Telugu
పల్లవి

నీ ప్రేమ నా జీవితాన్ని – నీకై వెలిగించెనే యేసయ్యా నీ కృప సెలయేరులా – నాలో ప్రవహించెనే (2) నన్ను క్షమియించెనే – నన్ను కరుణించెనే నన్ను స్థిరపరచెనే – నన్ను ఘనపరచెనే యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా యేసయ్యా ఓ మెస్సయ్యా (2) నేను నిన్ను విడచిననూ – నీవు నన్ను విడువలేదయ్యా దారి తప్పి తొలగిననూ – నీ దారిలో నను చేర్చినావయ్యా ఏమివ్వగలను నీ కృపకు నేను వెలకట్టలేను నీ ప్రేమను (2)       ||యేసయ్యా||

1వ చరణం

జలములు నన్ను చుట్టిననూ – నీ చేతిలో నను దాచినావయ్యా జ్వాలలు నాపై లేచిననూ – నీ ఆత్మతో నను కప్పినావయ్యా వెలకట్టలేను నీ ఆత్మను

Report Error