నీ ప్రేమ నాలో మధురమైనది

nee preema naaloo madhuramainadi

🎵 TG-1769🌐 Telugu
పల్లవి

నీ ప్రేమ నాలో మధురమైనది అది నా ఊహకందని క్షేమ శిఖరము (2) ఏరి కోరుకున్నావు ప్రేమ చూపి నన్ను పరవశించి నాలో మహిమపరతు నిన్నే సర్వకృపానిధి నీవు – సర్వాధికారివి నీవు సత్య స్వరూపివి నీవు – ఆరాధింతును నిన్నే ||నీ ప్రేమ||

1వ చరణం

చేరితి నిన్నే విరిగిన మనస్సుతో కాదనలేదే నా మనవులు నీవు హృదయము నిండిన గానం – నను నడిపే ప్రేమ కావ్యం నిరతము నాలో నీవే – చెరగని దివ్య రూపం ఇది నీ బాహు బంధాల అనుబంధమా తేజోవిరాజా స్తుతి మహిమలు నీకే నా యేసురాజా ఆరాధన నీకే (2)         ||నీ ప్రేమ||

2వ చరణం

నా ప్రతి పదములో జీవము నీవే నా ప్రతి అడుగులో విజయము నీవే ఎన్నడు విడువని ప్రేమ – నిను చేరే క్షణము రాదా నీడగా నాతో నిలిచే – నీ కృపయే నాకు చాలును ఇది నీ ప్రేమ కురిపించు హేమంతమా నీ సింహాసనము నను చేర్చుటకు సిలువను మోయుట నేర్పించితివి కొండలు లోయలు దాటే – మహిమాత్మతో నింపినావు దయగల ఆత్మతో నింపి – సమాభూమిపై నడిపినావు ఇది నీ ఆత్మ బంధముకై సంకేతమా

Report Error