నీ ప్రేమకు సాటి లేనే

nee preemaku saati leenee

🎵 TG-1743🌐 Telugu
పల్లవి

నీ ప్రేమకు సాటి లేనే లేదు ప్రేమారూపా యేసురాజా (2) నింగియందునా – నేల యందునా పాతాళమందునా – ఎందైన గాని నీకన్నా అధికులు ఎవరు లేనే లేరు ||నీ ప్రేమకు||

1వ చరణం

పాపినైన నా కొరకు – పరలోకం విడచినదెవరు నా పాపముల కొరకై – సిలువలో మరణించినదెవరు క్షమియించి రక్షించిన నా తండ్రి నీవే ధరలోని ధన ధాన్యములు – నన్ను వీడినా ఇలలో నా సరివారు – త్రోసివేసినా ఇహమందు పరమందు నా ధనము నీవే

Report Error