నీ ప్రేమలో నుండి నన్ను

nee preemaloo nundi nannu

🎵 TG-2787🌐 Telugu
పల్లవి

నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు (2) శ్రమలైనను శత్రువైనను నిన్ను నన్ను వేరు చేయలేవు యేసయ్యా యేసయ్యా నిను మరువలేనయ్యా యేసయ్యా యేసయ్యా నిను విడువలేనయ్యా క్షణమైన నువ్వు లేక నే ఉండలేనయ్యా (2)   ||నీ ప్రేమలో||

1వ చరణం

జీవించుచున్నది నేను కాదు క్రీస్తే నాలో జీవిస్తున్నాడు ఏదేమైనా నాకు యేసే కావాలి ఎవరేమన్నా నాకు యేసే కావాలి (2) ||యేసయ్యా||

2వ చరణం

నీ చిత్తం చేయుటకు నాకు ఆనందం నీ ప్రతి మాటకు లోబడి ఉంటాను ఏమిచ్చినా నీకు స్తోత్రాలే ఏమివ్వక పోయినా వందనాలే ఈ లోకాన్ని నేను పెంటగా ఎంచాను నీ కోసమే నీ ప్రేమ కోసమే నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైననేమి అది లాభమే

Report Error