నీ వాక్యమే నా పాదాలకు
nee vaakyamee naa paadaalaku
🎵 TG-1823🌐 Telugu
పల్లవి
నీ వాక్యమే నా పాదాలకు దీపము నీ చిత్తమే నా జీవిత గమనము (2) కృప వెంబడి కృపతో – నను ప్రేమించిన దేవా వందనాలయ్యా నీకే – వేలకొలది వందనాలయ్యా స్తోత్రాలయ్యా – కోట్లకొలది స్తోత్రాలయ్యా ||నీ వాక్యమే||
1వ చరణం
నీ భారము నాపై వేయుము ఈ కార్యము నే జరిగింతును నా కృప నీకు చాలును అని వాగ్దానమిచ్చావయ్యా (2) ||వందనాలయ్యా||
2వ చరణం
పర్వతములు తొలగిననూ మెట్టలు తత్తరిల్లిననూ నా కృప నిన్ను వీడదు అని అభయాన్ని ఇచ్చావయ్యా ||వందనాలయ్యా||