నే యేసుని వెలుగులో నడిచెదను
nee yeesuni veluguloo nadichedanu
🎵 TG-1924🌐 Telugu
పల్లవి
నే యేసుని వెలుగులో నడిచెదను రాత్రింబగలాయనతో నడిచెదను వెల్గున్ నడిచెదను – వెంబడిచెదను యేసుడే నా రక్షకుడు నడిచెద నే ప్రభు యేసునితో నడిచెద నే ప్రభు హస్తముతో కాంతిలో నుండగ జయగాంతును యేసునే నే వెంబడింతును గాడంబగు చీకటిలో భయపడను ఆత్మతో పాడుచు సాగిపోవుదును యేసుడే నా ప్రియుండు ||నడిచెద||
1వ చరణం
వెల్గులో ప్రభు స్వరము నే వినుచుందును సర్వమిచ్చెదను చెంతనుండెదను యేసుడే ప్రేమామయుడు దిన సహాయము నే పొందెదను సుఖ దుఃఖమైన మరణంబైన యేసుడే నా యండనుండును నా దృష్టిని ప్రభుపై నుంచెదను సిల్వ ధ్వజమునే బట్టి వెళ్లెదను యేసుడే నా చెంత నుండును