నేడో రేపో నా ప్రియుడేసు
needoo reepoo naa priyudeesu
🎵 TG-2739🌐 Telugu
పల్లవి
నేడో రేపో నా ప్రియుడేసు మేఘాలమీద ఏతెంచును మహిమాన్వితుడై ప్రభు యేసు మహీ స్థలమునకు ఏతెంచును ||నేడో రేపో||
1వ చరణం
చీకటి కమ్మును సూర్యుని చంద్రుడు తన కాంతినీయడు (2) నక్షత్రములు రాలిపోవును ఆకాశ శక్తులు కదిలిపోవును కడబూర స్వరము ధ్వనియించగా ప్రియుని స్వరము వినిపించగా వడివడిగ ప్రభు చెంతకు చేరెద ప్రియమార ప్రభుయేసుని గాంచెద నా ప్రియుడేసుని సన్నిధిలో వేదన రోదనలుండవు హల్లెలూయా స్తుతిగానాలతో నిత్యం ఆనందమానందమే