నీదు ప్రేమ నాలో ఉంచి
needu preema naaloo unchi
🎵 TG-2920🌐 Telugu
పల్లవి
నీదు ప్రేమ నాలో ఉంచి జీవమునిచ్చావు నీదు రూపమే నాలో ఉంచి నన్ను చేసావు మంటివాడను నన్ను నీవు మహిమపరిచావు మరణపాత్రుడనైన నన్ను పరము చేర్చావు ఎంత ప్రేమ యేసయ్యా – నీకెంత నాపై కరుణయో మరువగలనా నీ కృప – బ్రతుకంతయు (2) తోడువైనావు నా నీడవైనావు నీవు నాకు ఉండగా నాకు ఈ దిగులెందుకు మంచి కాపరి నీవేనయ్యా నా యేసయ్యా ఎంచలేనయ్యా నీ వాత్సల్యం ఓ మెస్సయ్యా జీవితమంతా మరువలేనయ్యా ||నీదు ప్రేమ||
1వ చరణం
ప్రాణమైనావు నీవే ధ్యానమైనావు అన్నీ నీవై చేరదీసి ఆశ్రయమైనావు నీతిసూర్యుడా పరిపూర్ణుడా నిత్య దేవుడా కీర్తనీయుడా కృపాపూర్ణుడా సత్యజీవుడా నేను నిన్ను విడువలేనయ్యా