నీదు విశ్వాస్యత మా ప్రభు
needu vishvaasyatha maa prabhu
🎵 TG-2635🌐 Telugu
పల్లవి
నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షము నధిగమించెను (2) నిను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించు మానుజావళికి నిబంధనను స్థిరముగ జేసి నిరతము నలరారెడు మా ప్రభువా (2) ||నీదు||
1వ చరణం
వేయి తరముల వరకు సరిగా విలసిల్లేటి వెలలేని మా వింతల కృపాంబుధి యగు దేవా యెంతయో నిను స్తుతియింతుము కోరి నీ సత్య సంధత్వ మహిమ నిరతము నిలయం సంస్తుతులకు మెరసెను నా మదిలోన దేవా మరువగ లేమి మధుర ప్రేమ ఎంతైనను నమ్మదగిన వింతైన నీ విశ్వాస్యత వాత్సల్యత వెలసెను మాపై క్రొత్తగా ప్రతి దినము యేసు ప్రభు మన ఆత్మను జీవము దేహమును మన ప్రభు యేసు రాకడ వరకు వొనరుగ కాపాడును పదిలముగా దిన దినమును నిందారహితముగా తండ్రి కుమార శుద్ధాత్మకును తర తరములకు మహిమ ఘనత పరిపూర్ణముగా ప్రబలును గాక పరి పరి విధముల ప్రభు సంఘములో