నీకే నా ఆరాధనా.. నీకే
neekee naa aaraadhanaa.. neekee
🎵 TG-1560🌐 Telugu
పల్లవి
నీకే నా ఆరాధనా.. నీకే ఆరాధనా.. (2) యుగయుగములకు తరతరములకు మహిమా ప్రభావము నీకే యేసయ్యా.. నీకే యేసయ్యా.. ||నీకే||
1వ చరణం
నిన్న నేడు రేపు కూడ మారని వాడవు ఎప్పటికిని ఏకరీతిగా ఉండువాడవు (2) ||నీకే||
2వ చరణం
ఆత్మతోను సత్యముతోను ఆరాధింతును ఎప్పటికిని నిన్ను మాత్రమే నే సేవింతును నీ రాజ్యములో నేను చేరు భాగ్యం నాకు దయచేయుమా ఎప్పటికిని నీ అరచేతిలో చెక్కియుంచుమా