నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను
neeneemainaa prabhuvaa ninnee sthuthisthaanu
🎵 TG-1373🌐 Telugu
పల్లవి
నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను (2) నేనేమైయున్నానో నీ దయ వలనేనయ్యా నాకున్నవన్నియు నీవిచ్చినవేనయ్యా (2) ||నేనేమైనా||
1వ చరణం
లేక లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుని ఇచ్చింది నీవే ఇచ్చిన నీవే బలి కోరగా తెచ్చి నీకు అర్పించిన అబ్రహాములా ||నేనేమైనా||
2వ చరణం
సర్వము పోయి శరీరము కుళ్ళిన నా అనువారే వెలివేసినా ఆప్తులంతా శత్రువులైనా అంతము వరకు సహియించిన ఆ యోబులా నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైనా అది నాకెంతో మేలే ఇదిగో నేను ఉన్నానయ్యా దయతో నన్ను గైకొనుమయ్యా నా యేసయ్యా