నేను ఏడ్చిన చోటనే మనసారా
neenu eedchina chootanee manasaaraa
🎵 TG-2540🌐 Telugu
పల్లవి
నేను ఏడ్చిన చోటనే మనసారా నవ్వెదా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా – (2) నేను ఓడిపోనయా – నా పక్షానుండగా నేను కృంగిపోనయా – నీవు నా తోడుండగా నేను పడిన చోటనే ప్రభు కొరకై నిలిచెదా (2) ||నేను ఓడిపోనయా||
1వ చరణం
అవమానం పొందిన చోటే అభిషేకం నాకిచ్చావే వెలివేయబడిన స్థలములో నన్ను నిలిపినావే ఖ్యాతినిచ్చి ఘనతా నిచ్చి మంచి పేరు నాకిచ్చావే శాశ్వతమైన కృపతో నన్ను నడుపుచున్నావే ||నేను ఓడిపోనయా||
2వ చరణం
నిందలన్ని పొందిన చోటే ఘనతనిచ్చినావే నా శత్రువులేదుటే నాకు విందు చేసినావే ఖ్యాతినిచ్చి ఘనతానిచ్చి మంచి పేరు నాకిచ్చావే నన్ను చూచి నవ్వినచోటే నా తలపైకెత్తినావే నన్ను దూషించిన చోటే దీవించినావే