నేను తగ్గాలి యేసు

neenu thaggaali yeesu

🎵 TG-2599🌐 Telugu
పల్లవి

నేను తగ్గాలి యేసు – నీవే హెచ్చాలి (2) నేను పూర్తిగా మరుగై – నీవే కనబడాలి ఇదియే నా ప్రార్థన – నీ చిత్తము (2)      ||నేను||

1వ చరణం

నేను యేసుతో కూడా సిలువ వేయబడాలి నా స్వార్ధ్య జీవితమంతా లయమైపోవాలి యేసూ నీ స్వభావము నాలో అధికమౌతు ఉండాలి పరలోక జీవము నాలో అభివృద్ధి చెందాలి (2)      ||ఇదియే||

2వ చరణం

ఆదాము పాపము నాలో వసియించియుండగా యేసూ నీ రక్తమే దాని నశియింప చేయును ఆటంకమేమియు లేక జీవధారలుండాలి యేసూ నీ జీవము నాలో నింపబడుతు పోవాలి

Report Error