నేను వెళ్ళే మార్గము

neenu vellllee maargamu

🎵 TG-2359🌐 Telugu
పల్లవి

నేను వెళ్ళే మార్గము – నా యేసుకే తెలియును శోధించబడిన మీదట – నేను సువర్ణమై మారెదను (2)     ||నేను||

1వ చరణం

కడలేని కడలి తీరము – ఎడమాయె కడకు నా బ్రతుకున (2) గురిలేని తరుణాన వెరువగ – నా దరినే నిలిచేవ నా ప్రభు హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా ఆమేన్‌ జలములలోబడి నే వెళ్లినా – అవి నా మీద పారవు అగ్నిలో నేను నడచినా – జ్వాలలు నను కాల్చజాలవు విశ్వాస నావ సాగుచు – పయనించు సమయాన నా ప్రభు సాతాను సుడిగాలి రేపగా – నా యెదుటే నిలిచేవా నా ప్రభు (2)         ||నేను||

Report Error