నేనునూ నా ఇంటి వారును
neenunuu naa inti vaarunu
🎵 TG-2197🌐 Telugu
పల్లవి
నేనునూ నా ఇంటి వారును యెహోవాను సేవించెదము ఆయనే సజీవుడని ఆయనే విజేయుడని (2) సిలువలోన నీకు నాకు విజయము చేకూర్చెనని ||నేనునూ||
1వ చరణం
శ్రమలో శోధనలో మరణ బంధకంలో శాంతి సమాధానం దయచేసి దేవుడు ఆశా నిరాశలలో ఆవేదన వలయంలో ఏ దేవుడు చేయలేని అద్భుతములు చేసినాడు (2) ||నేనునూ||
2వ చరణం
ఏ పాపము నన్ను ఏలనీయని వాడు ఏ అపాయమును రాకుండా కాపాడును కునుకు పాటు లేనివాడు నిదురపోని దేవుడు నేను నమ్మినవాడు నమ్మదగిన దేవుడు దీర్ఘాయువు చేత దీవించు దేవుడు దీర్ఘ శాంతముతో దీనత్వము నేర్పును మేలు చేత నా హృదయం తృప్తిపరచు దేవుడు మేలు చేత కీడునెలా జయించాలో నేర్పును