నీతి న్యాయములు జరిగించు నా

neethi nyaayamulu jariginchu naa

🎵 TG-2329🌐 Telugu
పల్లవి

నీతి న్యాయములు జరిగించు నా యేసయ్యా నిత్య జీవార్థమైనవి నీ శాసనములు (2) వృద్ధి చేసితివి పరిశుద్ధ జనముగా నీ ప్రియమైన స్వాస్థ్యమును రద్దు చేసితివి ప్రతివాది తంత్రములను నీ రాజ్య దండముతో ||నీతి||

1వ చరణం

ప్రతి వాగ్ధానము నా కొరకేనని ప్రతి స్థలమందు – నా తోడై కాపాడుచున్నావు నీవు నిత్యమైన కృపతో నను బలపరచి ఘనతను దీర్గాయువును దయచేయువాడవు (2)      ||నీతి||

2వ చరణం

పరిమళ వాసనగ నేనుండుటకు పరిశుద్ధ తైలముతో – నన్నభిషేకించి యున్నావు నీవు ప్రగతి పథములో నను నడిపించి ప్రఖ్యాతిని మంచి పేరును కలిగించువాడవు నిత్య సీయోనులో నీతో నిలుచుటకు నిత్య నిబంధనను – నాతో స్థిరపరచుచున్నావు నీవు మహిమ కలిగిన పాత్రగ ఉండుటకు ప్రజ్ఞ వివేకములతో నను నింపువాడవు

Report Error